పోలవరం ప్రాజెక్ట్ కి జగన్మోహన్ రెడ్డే ఒకశాపం..ఆయన పాలనే గుది బండ అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖామంత్రా..లేక నోటిపారుదల శాఖా మంత్రా అని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్నిప్రాజెక్ట్ లను డయాఫ్రమ్ వాల్ తోనే నిర్మించారా అంబటి అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ లు వాటినిర్మాణంపై నీకు, మీ ముఖ్యమంత్రికి ఉన్న అవగాహన ఏమిటో మీ పాండిత్యంతోనే అర్థమవుతోందన్నారు. అధికారంలోకి రాగానేరివర్స్ టెండరింగ్ డ్రామాలాడిన జగన్మోహన్ రెడ్డి, పనులుచేస్తున్నకంపెనీలను సాగనంపాడున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణను జగన్ రెడ్డి గాలికొదిలేయడంవల్లే వరద ప్రభావంప్రాజెక్ట్ పై పడిందన్నారు.
‘‘రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ జరిపి అర్హతలేని, అనుభవంలేని కంపెనీలకు ప్రాజెక్ట్ పనులు అప్పగించాడు.షార్ట్ లిస్ట్, ప్రైస్ బిడ్, ఫ్రీ క్వాలిఫికేషన్, సెల్ఫ్ డిక్లరేషన్, బ్యాంకు గ్యారంటీ, లాంటి అనేక నిబంధనలు మార్చి, తనకుకమీషన్లు ఇచ్చే అనామక కంపెనీని తెరపైకితెచ్చాడు. కాంట్రాక్ట్ ఏజెన్సీలను మారిస్తే ప్రాజెక్ట్ భద్రతప్రశ్నార్థకమవుతుందని పీపీఏ అధికారులుచెప్పినా జగన్ రెడ్డి వినలేదు. తన రాజకీయఅవసరాలకోసమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నార్థకంగా మార్చాడు.
పోలవరంనిర్మాణంలో ముఖ్యమంత్రి దుందుడుకు తీరుని పోలవరంప్రాజెక్ట్ అథారిటీ హెచ్చరించింది వాస్తవంకాదా? పీపీఏ సీఈవో ఆర్.కే.జైన్ 16ఆగస్ట్ 2019న రాష్ట్రప్రభుత్వానికిరాసినలేఖలో పనులుచేస్తున్న ఏజెన్సీలను రద్దుచేయవద్దని కోరినా జగన్ రెడ్డి ఖాతరుచేయలేదు. 2000సంవత్సరంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి దాన్నిఎందుకుదాచిపెట్టాడో రైతాంగానికి సమాధానంచెప్పాలి. డయాఫ్రమ్ వాల్ పై నిర్మాణం చేయడానికి వీలుపడదనే వాస్తవాన్ని ఎందుకు మరుగునపరిచావు జగన్ రెడ్డీ? చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేది’’అని అన్నారు.