ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న వీడియోలు ఏమైనా ఉన్నాయి అంటే.. అవి కేవలం వెడ్డింగ్ వీడియోలు అని చెప్పాలి. వీటి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. ఎక్కువ మంది వీటిని చూడడంతో పాటు విపరీతంగా షేర్ కూడా చేస్తున్నారు. దీంతో వీటికి గతంలో కంటే ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో పెళ్లికి వచ్చి కెమెరా మ్యాన్ లు కూడా కెన్డిడ్ ఫోటోలపై, వీడియోలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ పెళ్లి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది.. అనేది ఇప్పుడు చూద్దాం. ఓ పెళ్లి జంట.. వాక్ చేస్తుంటూ వస్తుంటారు. ఈ తరుణంలోనే ఓ అమ్మాయి.. ఆ పెళ్లి కొడుకును ఒక్క సారిగా పక్కన ఉన్న నీటిలోకి తోసి వేస్తుంది. దీంతో ఆ వరుడు అదుపు తప్పి ఆ నీటిలో పడిపోతాడు. ఈ నేపథ్యం లోనే ఒక్కడే పడితే ఏం బాగుంటుంది అని అనుకున్నాడో ఏమో కానీ.. వదువును కూడా పట్టి లాగేస్తాడు. దీంతో ఇద్దరూ ఒకేసారి పడిపోతారు.
ఆ తరువాత అమ్మాయి… అబ్బాయి వెనుక భాగంలో ఎక్కి.. ముద్దు పెడుతుంది. దీనికి క్యాప్షన్ గా ఏది ప్రేమలో పడినట్లు అని వీడియో పై రాసి ఉంటుంది. ఈ వీడియో అంతా వారు చాలా తమాషాగా ఉంటారు. అందుకే ఇది వారి మధ్య ప్రేమకు చిహ్నం అని అంటున్నారు నెటిజన్లు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.