Site icon 123Nellore

అడవిలో జింకల సందడి.. వైరల్ గా మారిన వీడియో!

అడవులలో నివసించే జంతువులలో జింక ఒకటి. ప్రతి ఒక్క చిన్న జూ పార్కు లలో కూడా జింకలు కనిపిస్తుంటాయి. వీటిని పెంచడం చాలా తేలిక. ఇవి చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి. కానీ వీటికి కావాల్సినంత ఆహారం దొరకడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవి తరచుగా తమ నోటికి పని చెబుతూనే ఉంటాయి.

దీంతో వాటికి ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది. దాంతో అటవీ అధికారులు అప్పుడప్పుడు జింకలను ఒకచోట నుండి మరో చోటుకు మారుస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆహార కొరత సమస్య తక్కువగా ఉంటుంది. ఇక వీటిని తినే వన్యమృగాలకు కూడా ఆహారం లభిస్తుంది.

అలా ఓసారి జింకలను ఒకచోట నుండి మరో చోటకు పంపిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ నెటిజన్లకు షేర్ చేశాడు. ఈ వీడియోను గత ఏడాది ఉదయం వేళ ఐదు గంటలకు తీశానని తెలిపాడు.ఆ వీడియోను తానే స్వయంగా షూట్ చేశానని తెలిపాడు.

ఇక ఆ వీడియోలో అటవీ అధికారులు ఓ పెద్ద వ్యాన్ లో కొన్ని జింకల్ని తీసుకొచ్చారు. వెంటనే డోర్ తెరవగానే జింకలు అడవిలోకి పరుగులు తీసి సందడి చేశాయి. ఇక ఆ జింకలను తరలించిన ప్రాంతం రక్షణాత్మక ప్రాంతమని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ లైకులు కొడుతున్నారు.

Exit mobile version