Site icon 123Nellore

సైకిలిస్ట్ ను కుమ్మి అవతల పడేసిన ఎద్దు.. ఎందుకంటే?

అంతా ప్రశాంతంగా ఉంది. సైకిలిస్టులు అందరూ ఎవరి దారిన వారు రేసులో దూసుకుపోతున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ.. మధ్యలో ఓ ఎద్దు ఎక్కడ నుంచి వచ్చిందో కానీ వచ్చి అమాంతంగా ఓ సైకిలిస్ట్ ను ఎత్తి కింద పడేసింది. అంతేగాకుండా చాలా తీవ్రంగా అతని పై దాడి చేసింది. విచిత్రం ఏమిటంటే ఆ ఎద్దు మిగతా ఎవరి మీద దాడి చేయకుండా కేవలం ఒకే వ్యక్తి మీద దాడి చేయడం గమనార్హం. అయితే ఆ ఎద్దు ఎందుకు ఆ వ్యక్తిపై దాడి చేసింది అనేది ఇంకా తెలియలేదు. అందులోనూ అదే దారిన పోతున్న వారిని ఏం అనుకుండా కేవలం ఆ ఒక్క వ్యక్తి మీదే దాడి చేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.

Cyclist Tossed In The Air By Raging Bull During Race

నార్మల్ గా అయితే ఎద్దులు ఎవరి మీద విరుచుకుపడవు. అందులోనూ దారిన పోయే వ్యక్తుల మీద అయితే అసలు ఏం హానీ తలపెట్టవు. అందులోనూ వాటికి ఎవరూ హానీ చేయకపోనంత వరకు అవి దాడికి పూనుకోదు. అలాంటి ఆ వ్యక్తికి ఎందుకు హానీ తలపెట్టిందా అనేది అర్థం కాకా చాలా మంది తలలు పట్టుకుంటున్నారు.

అసలు ఏం జరిగింది అంటే… అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ సంస్థ ఎప్పటిలాగే సైకిల్ రేసు నిర్వహించింది. ఇందులో చాలా మంది సైకిలిస్టులు పాల్గొన్నారు. వారు వారి నిర్దేశిత మార్గంలో వెళ్తున్నారు. అయితే సడెన్​ గా వచ్చింది ఆ ఎద్దు. ఆ సైకిలిస్టుల్లో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కుమ్మి విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి దూరంగా ఎగిరిపడ్డాడు. కానీ ఆ వ్యక్తి అదృష్టం బాగుండింది. ఏం కాలేదు. ఈ ఘటన జరిగేటప్పుడు ఆ ఎద్దు యజమాని కూడా ఉన్నారు. అయితే తాను దూరంగా ఉన్నానని.. ఆ ఘటనకు తనకు ఏం సంబంధం లేదని తెలిపాడు. అయితే ఈ వైర‌ల్ అవుతున్న‌ది.

Exit mobile version