అంతరిక్షంలో జరిగే ప్రతిదీ వింతగానే ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడం అంటే మానవునికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మనిషి ఆకాశానికి నిచ్చెన వేశాడు. అంతరిక్షంలోని వెళ్లి అక్కడ ఉన్న రహస్యాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాడు. కొన్ని విజయవంతం అయితే మరి కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ అంతరిక్ష పరిశోధనల్లో కీలక మైనది. మార్స్ అంతరిక్ష ప్రయోగం. చాలా దేశాలకు మార్స్ అంతరిక్ష ప్రయోగం ఇప్పటికీ కలగానే ఉంది. అయితే కొన్ని దేశాలు మాత్రం దీనిని అందిపుచ్చుకున్నాయి.
ప్రస్తుతం అరుణ గ్రహం మీద పరిశోధన జరుపుతున్న దేశాల్లో అమెరికా ఒకటి. ఈ మార్స్ పై అమెరికా పంపిన ఓ రోవర్ అక్కడి వింతలను, విశేషాలను ఎప్పటికప్పుడు సేకరించి వాటిని నాసా శాస్త్రవేత్తలను పంపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వస్తువును కనుకొన్నది మార్స్ రోవర్. ఈ నెల 13న ఈ వస్తువును మార్స్ రోవర్ కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుతం దీనిపై పరిశోధనలు తమ బృందం అధ్యయనం చేస్తుందని శాస్రవేత్తలు పేర్కొన్నారు.
మార్స్ రోవర్ కనిపెట్టిన ఆ వింత వస్తువు ఏం అయి ఉంటుంది అనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. మార్స్ రోవర్ పంపిన ఆ వస్తువు ఫోటో ప్రకారం అది ఒక పాత కాలపు వస్తువులాగే కనిపిస్తుంది. కానీ అది నిజంగానే ఓ పాత కాలం వస్తువా? లేక ఏళ్ల కింద ఉన్న శిలలకు సంబంధించి ఆనవాలా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వస్తువుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.