Site icon 123Nellore

జూ నుంచి బయటకు వచ్చిన మొసలి.. ఏం చేసిందంటే?

జంతువులను జూలో ఉన్నప్పుడు చూడడానికి బయటకు వచ్చాక చూడడానికి చాలా తేడా ఉంటుంది. జూలో ఉంటే ఏ జంతువును అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. అదే కానీ జూ లేకుండా ఉంటే దాని దగ్గరకు పోవాలి అన్నా కానీ సంకోచిస్తాము. నిజానికి క్రూర మృగాలను చూసేందుకు చాలా మంది జూ కి వెళ్తారు. అవి చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టే చూస్తారు. కొన్ని సార్లు జూలో ఉన్న జంతువులు కూడా బయటకు వస్తుంటాయి. అయితే మన దగ్గర అయితే చాలా అరుదు కానీ.. పశ్చిమ దేశాల్లో అయితే ఇలా జంతువులు జూ నుంచి బయటకు రావడం చాలా కామన్.

Crocodile Escapes Van, Makes A Dash For Freedom

అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. జూ లో ఉండాల్సి ముసలి ఏకంగా రోడ్డు మీద వెళ్లే వారికి దర్శనం ఇచ్చింది. వాస్తవానికి నీటిలో మాత్రమే బలం ఉండే ఈ జంతువు బయటక కనిపించేసరికి చూసిన వారిలో చాలా మంది ఆశ్యర్య పోయారు. అయితే దాని నుంచి దూరంగా వెళ్లారు. కానీ ఓ ముగ్గురు మహిళలలు మాత్రం ఆ ముసలిని వదలకుండా గట్టిగా పగ్గాలు వేసుకుని పట్టినట్లుగా పట్టుకుని బంధించారు. ఈ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగింది అంటే… ఆ ముసలిని కాపాడిన ముగ్గురు మహిళలు జూ ఆఫీసర్లు. దానిని పట్టకునేందుకు అక్కడకు వచ్చారు. వారు ఒక జూ నుంచి మొసలిని మరో జూ కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. నార్మల్​ గానే ఓ వ్యాన్​ లో ఆ మొసలిని జూ అధికారులు ఒక జూ నుంచి మరో జూ కు తరలిస్తున్నారు. అదే సమయంలో ఆ మొసలి వ్యాన్​ నుంచి బయట పడింది. దీంతో అలెస్ట్ అయిన మహిళా సిబ్బంది ఆ మొసలిని వెంటనే కట్టడి చేశారు. ఈ వీడియోను అక్కడ ఉన్న ఓ వ్యక్తి సెల్​ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్​ అవుతుంది. ఆ మహిళ ఆఫీసర్ల చాతుర్యానికి సామాజిక మాధ్యమాలు సాహో అంటున్నాయి.

Exit mobile version