Site icon 123Nellore

వైరల్​ అవుతున్న గిరిజన యువకుడి వెడ్డింగ్​ కార్టు.. ఎలా చేశాడంటే?

పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అని అంటారు పెద్దలు. వారేమీ ఊరికే అనలేదు. ఎన్నో చూసి ఈ సామెత కరెక్ట్ అని డిసైడ్​ అయ్యి మరీ చెప్పి ఉంటారు. అయితే వినూత్నంగా ఆలోచించడం అనేది మనిషిని ఇతరుల నుంచి వేరు చేస్తుంది. ఇలా వినూత్నంగా ఆలోచించే వారు ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. ఉదాహరణకు.. ఇటీవల ఓ యువకుడు తన రెజ్యూమే ను ఓ కంపెనీ కరపత్రంపై ప్రచురించి వైరల్ అయ్యాడు. ఆ యువకుడి వినూత్న ఆలోచనను చూసిన ఆ సంస్థ భారీ మొత్తంలో సాలరీ ఇచ్చి హైర్​ చేసుకుంది. అయితే ఇప్పుడు ఇంకో వ్యక్తి అలానే ఆలోచించాడు. తన పెళ్లి కార్డును ఏకంగా ఆధార్​ కార్డు పై ప్రచురించి వైరల్ అవుతున్నాడు.

Couple printed such wedding card that went viral on social media

ఇంతకీ ఏం జరిగింది అంటే ఛత్తీస్​ ఘడ్​ రాష్ట్రంలో ఓ గిరిజన యువకుడు వినూత్నంగా ఆలోచించి వెడ్డింగ్​ ఇన్విటేషన్​ కార్డును ఆధార్​ కార్డుపై ప్రచురించాడు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్​ గా మారింది. ఆధార్ కార్డుపై వివాహ ఆహ్వానానికి ఇవ్వాల్సి కీలక సమాచారాన్ని స్పష్టంగా అందులో ఉంచాడు. దీనితో పాటు పెళ్లికి వచ్చేవారు తీసుకోవాల్సిన కొవిడ్​ జాగ్రత్తల గురించి కూడా రాసుకొచ్చాడు.

పెళ్లి ముహుర్తం.. ఎప్పుడు జరిగేది… ఎక్కడ జరిగేది… ఎవరితో ఇలా కావాల్సిన సమాచారం అంతటినీ దానిలోనే పొందు పరిచాడు. ఇలా తాను చేసిన ఈ ప్రత్యేక కార్డును మిత్రులకు పార్వర్డ్​ చేయగా.. వారు సోషల్​ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ఓ రేంజ్​ లో వైరల్ అవుతుంది.

Exit mobile version