Site icon 123Nellore

ఎండాకాలం రాగి జావ ఎంతో ఉపయోగం..తాగడం మిస్సవద్దు..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనే పదం అందరూ వినే ఉంటారు. అంటే పాతవి ఏవైనా అద్భుతంగానే ఉంటాయని దీనర్థం. ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నారబ్బా అనుకోకండి. ఇప్పటి కంప్యూటర్ కాలం వచ్చాక రాగి జావను సరిగా పట్టించుకోవడం లేదుగానీ, గతంలో దీన్ని రోజంతా పనిచేసిన రోజులున్నాయి. రాగిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సంగటి కూడా చేస్తారు. ఈ సంగటి తెలంగాణ, రాయలసీమలో ఎక్కవగా ఉండేడి గతంలో.

ఇక నాటుకోడి కూర, సంగటితో వడ్డించుకుని తింటే వచ్చే టేస్టే వేరు. ఇక జావ విషయానికి వస్తే దీనికి ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి. ఉత్తరాంధ్రలో అంబలి అని, కోస్తా, రాయలసీమలో జావ అని అంటారు.  ఈ జావ రాగులు, జొన్నలు, కొర్రలతో చేస్తారు. అయితే ఇవి ఎండాకాలం మంచి ఉపకరణాలు చేస్తాయి ఒంటికి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే దీని ప్రయోజనాలను ఎతుక్కుంటున్నారు.  ఎండా కాలంలో జావ తాగితే శరీరానికి మంచి ఔషదంలా పని చేస్తుంది. ఎండకాలంలో జావలో కొంచం మజ్జిగ కలిపి తాగితే ఒంట్లో వేడి పెరగదు.

శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. ఇక అధిక బరువుతో బాధపడేవారు కాలాలతో సంబంధం లేకుండా నిత్యం జావ తాగితే వేల కేలరీలు ఖర్చైపోతాయి. ముఖ్యంగా జావ వల్ల అలసట రాదు. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. మధుమేహం, స్థూలకాయం, బీపీ పేషెంట్లకు ఇది చక్కటి మెడిసిన్‌లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి జావ తాగడం వల్ల శుక్రకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పలు పరిశోధనలు వెల్లడైంది. శరీరం కూడా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి జావ తాగే విధానాన్ని అలవాటు చేసుకుంటే ఒంటికి ఎంతో మంచిదని చెప్తున్నారు పెద్దలు.

Exit mobile version