Site icon 123Nellore

మంత్రి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు..మండిపడ్డ టీడీపీ నేతలు

బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు వంటివి జరుగుతుంటాయని హోమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం విశాఖపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ను హోమంత్రి సందర్శించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు దాడుల గురించి విలేకరులు ప్రశ్నించగా వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తండ్రి ఏదైనా పనిమీద బయటకు వెళ్తే బిడ్డల సంరక్షణ  బాధ్యతలు తల్లి తీసుకుంటుందని అన్నారు.

అయితే తల్లి కూడా కూలిపనుల కోసం, ఉద్యోగం కోసం బయటకు వెళ్లిపోతుండటంతో  పిల్లలు ఇంట్లో ఉంటున్నారని, దీనిని అలుసుగా తీసుకోవడం వల్లే ఇరుగు పొరుగు వారు పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఓ బాలికపై అత్యాచారానికి సంబంధించి హోమంత్రిని ప్రశ్నించగా వాస్తవాన్ని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని, అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని అన్నారు.

అయితే మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. జగన్ 11 కేసులతో 16 నెలలు జైల్లో ఉండటానికి విజయమ్మ కారణమా అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అని ప్రశ్నించారు.వనిత మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్నారు. జగన్ చేతకాని పాలన వల్లే ఉన్మాదులు రెచ్చిపోయి అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ సరిగా పట్టించుకోకపోవడం వల్లే జగన్ ఆర్థిక ఉగ్రవాదిగా తయారయ్యారా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన భద్రతపై పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం మహిళ భద్రతపై పెట్టి ఉంటే ఇంత మంది మహిళల ప్రాణాలు పోయేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version