Site icon 123Nellore

దమ్ముంటే ఎన్నికలకు రా జగన్..! : బోండా ఉమ

జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ప్రజా వ్యతిరేకత జగన్ కు వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ కేవలం సింగిల్ సంఖ్యకే పరిమితం అవుతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయన్నారు. అంతర్జాతీయ క్రిమినల్  గ్యాంగ్ మొత్తం  వైసీపీలోనే ఉన్నారని విమర్శించారు. తాడేపల్లి కేంద్రంగా దొంగల  ముఠా మొత్తం పని చేస్తోందని విమర్శించారు. జైలుకు వెళ్లినోళ్లు, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్లు వైసీపీలోనే ఉన్నారని వివరించారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు తిడతారని మండిపడ్డారు.

జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా కారణంగా 26మంది చనిపోతే… తేలిగ్గా తీసుకున్నారని, చంద్రబాబు బాధ్యతతో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఇచ్చారని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు ఐదు కోట్లు విరాళం ఇచ్చారన్నారు. ప్రజలకు మేలు చేసే వాళ్లు జగన్ దృష్టిలో దొంగలుగా ఉంటారా అని ప్రశ్నించారు. నేడు జగన్ నిరాశ, నిస్పృహలతో ఉన్నాడని, పీకె ఇచ్చిన సర్వే రిపోర్టులతో జగన్ భయపడుతున్నాడన్నారు. రాష్ట్రాన్ని లూఠీ చేసి… ప్రజ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.

తప్పులు ఎత్తి చూపితే.. నీ అవినీతిని బయటపెడితే.. ఎల్లో మీడియా అని మాట్లాడతావా అంటూ రెచ్చిపోయారు. క్యాబినెట్ మంత్రులతో రాజీనామాలు చేయడం కాదు.. నువ్వు రాజీనామా చేసి.. అసెంబ్లీని రద్దు చేయాలని, దమ్ముంటే ఎన్నికలకు రా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రజలు జగన్ మీద ఆగ్రహంగా ఉన్నారని.. కొత్త నాటకం చేపట్టారని, డబ్బా గ్యాంగ్ తో పొగడించుకుంటూ.. ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి పొత్తులు ఏమీ కొత్త కాదని, ప్రజల అవసరాల కోసం అనేక సార్లు పెట్టుకున్నామన్నారు. పొత్తుల గురించి తామే మాట్లాడుకోలేదని,  మీకెందుకు అంత భయం అని ప్రశ్నించారు.

 

Exit mobile version