CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 17న సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖ టూర్ వివరాలేంటో తెలుసుందాం..
మొదట ముఖ్యమంత్రి 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం విజయనగరం జిల్లాలోని డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయడ బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ మహోత్సవానికి హజరుకానున్నారు.
ఆ తర్వాత సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్కుతో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలా 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు. రాత్రి 8గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే సీఎం పర్యటన సందర్భంగా అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ మల్లికార్జునతోపాటు, పోలీసు కమిషనర్ మనీశ్‌కుమార్ సిన్హా కలిసి విమానాశ్రయం, ఇప్పటికే జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్,న్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.