గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వనహించారు. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం.. తర్వాత వర్షాలు బాగాపడ్డంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయన్నాయన్నారు.
ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదన్నారరు. మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తమ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారని, వీటిని పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి, భోగాపురం, తిరిగి ఎన్‌హెచ్–16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. రోడ్డు విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకుని, ఎయిర్ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలని అధికారులకు సూచించారు. రాత్రి పూట ల్యాండింగ్ కూడా నేవీ ఆంక్షలు కారణంగా కష్టం అవుతోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.