Site icon 123Nellore

ఎంపీ రఘురామపై ఏపీ సీబీసీఐడీ నిఘా..ఢిల్లీకి పరార్

హైదరాబాద్ లో ఎంపీ రఘురామరాజు కదలికలపై ఏపీ సీబీసీఐడీ నిఘా పెట్టింది. ఎంపీ రఘురామరాజు ఇంటి దగ్గర ఏపీ ఐబీ అధికారులు శనివారం కాపు కాశారు.  అయితే ఐబీ అధికారుల కళ్లుగప్పి ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీ రఘురామరాజు. గతంలో దాఖలైన కేసులో విచారణకు రావాలంటూ సీబీసీఐడీ గతంలోనే నోటీసులు అందించింది. తనకు ఆరోగ్యం బాగాలేదంటూ రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరుకాలేదు.

పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందును తాను హాజరుకాలేనని అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు మకాం వేశారు. ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హస్బోలే కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.  అయితే మరోసారి తనను అరెస్టు చేసేందుకు ఇంటి ముందు ఏపీ పోలీసులు నిఘా పెట్టారని రఘురామకృష్ణరాజు అనుమానిస్తున్నారు. గతంలోనూ సీఐడీ అరెస్టులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు.

సుమారు రెండేళ్లకు పైగా రఘురామ వైసీపీకి తలనొప్పిగా తయారయ్యారు. రోజూ డిల్లీలో రచ్చబండ నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతినిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిపథకాన్ని గోదావరి వెటకారంతో వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్ అవినీతి కేసులూ త్వరగా తేల్చాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. నర్సాపురం రాకుండా ప్రభుత్వం తనను భయపెడుతోందని, తన హక్కులకు ఏపీ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని హోంశాఖా మంత్రికి లేఖలు కూడా రాశారు. ఆది నుండి వైసీపీకి కంటిలో నలుసులా తయారైన రఘురామను ఎంపీ పదవికి ఎలాగైనా అనర్హున్ని చేయాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ పందెలో వైసీపీ గెలుస్తుందా..రఘురామకృష్ణరాజు విన్ అవుతారో చూడాలంటే కొన్ని రోజులు పాటు ఆగాల్సిందే.

Exit mobile version