Site icon 123Nellore

ఆర్జీవీపై మరో కేసు.. డబ్బులు తీసుకుని బెదిరిస్తున్నాడంటూ..!

తాను చేసే పనుల వల్ల ఎన్ని కాంట్రవర్సీలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. తన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోను అంటుంటాడు దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. దాని వల్లే తను పలు సమస్యల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా వర్మ స్టైలే సెపరేటు.. ఎవ్వరికీ భయపడడు.. నచ్చింది మాట్లాడతాడు.. నచ్చినట్టు ఉంటాడు. అయితే అలాంటి వర్మపై ఓ వ్యక్తి ఛీటింగ్ కేసు పెట్టడం సంచలనంగా మారింది.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. గత కొంతకాలంగా నిజంగా జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించడం మొదలుపెట్టాడు వర్మ. అందులో ఒకటి ‘ఆశ ఎన్‌కౌంటర్’. 2019లో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ అమ్మాయిపై కొంద‌రు వ్య‌క్తులు అఘాయిత్యం చేసి చంపేశారు. ఆ కేసులో సంబంధం ఉందంటూ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ కూడా చేశారు. ఈ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వ‌ర్మ ‘ఆశ ఎన్‌కౌంట‌ర్’ అనే సినిమాను రూపొందించారు. పలు వివాదాలు ముసిరాయి. అవన్నీ దాటుకుంటూ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక లావా దేవీల విష‌యంలో వ‌ర్మ‌పై శేఖ‌ర్ రాజు  ఫిర్యాదు చేశారు.

సినిమా నిర్మాణం కోసం ఆర్జీవీ తన వద్ద రూ. 56 లక్షలు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వకుండా బెదిరించారని శేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం, ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని కూకట్‌పల్లి కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ 406, 407, 506 సెక్షన్ల కింద ఆర్జీవీపై మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.ఇటీవల నట్టి కుమార్ వ్యాఖ్యలపై, కేసులపై స్పందించిన ఆర్జీవీ మరి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version