Site icon 123Nellore

చోడవరం మహానాడులో చంద్రబాబు మాస్ స్పీచ్..

టీడీపీ సభలను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చోడవరం నుంచే జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చోడవరంలో నిర్వహించిన జిల్లా మహానాడు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ప్రజల్లో వ్యతిరేకత చూసి జగన్‍కు భయం పట్టుకుంది. మహానాడును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై రోజూ కేసులు పెడుతున్నాతు. ఇలాంటి వాటికి టీడీపీ కార్యకర్తలు బెదిరే పరిస్థితి లేదు. కార్యకర్తలను అండగా ఉంటాం.

మమ్మల్ని వేధిస్తే మీ గుండెల్లో నిద్రపోతా. రాష్ట్రంలో 26 మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏజెన్సీలో రెండు మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తాం. 15 రోజులకోసారి మహానాడు నిర్వహిస్తాం. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకం. వైసీపీ పాలనలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. విశాఖను ఏ-2 ముద్దాయి దోచేశాడు. విశాఖపై పెత్తమ విజయసాయిరెడ్డిదా? సుబ్బారెడ్డిదా? సీఎం అన్నీ ఫేక్ న్యూస్ మాట్లాడుతారు. వైసీపీని ఇంటికి పంపిచ్చే సత్తా ఉత్తరాంధ్రకు ఉంది.

గుంతలను కూడా పూడ్చలేని సీఎం మూడు రాజధానులు నిర్మిస్తారా. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు గుంతల మయం. టీడీపీ హయాంలో ఒక్క గుంతనైనా చూశారా. అది వైసీపీ పాలనకు.. టీడీపీ పనికి ఉన్న తేడా. సుందర కోనసీమలో రైతుల క్రాప్ హాలిడే ప్రభుత్వ అసమర్థత కాదా. రాష్ట్రంలో ఒక్కరైతైనా సంతోషంగా ఉన్నారా? సీఎం సొంత జిల్లా కడపలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీన్ని బట్టే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. అమ్మఒడి ఏమైంది?. టీచర్ల వ్యవస్థను సర్వనాశనం చేశారు. 25 వేల టీచర్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎత్తుగడ. బ్రాందీ షాపుల దగ్గర టీచర్లను ఉంచడం న్యాయమా?. మీ ఇంగ్లీష్ మీడియం ఏమైంది?.’’ అని ప్రశ్నించారు.

Exit mobile version