జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, ఈ సుభిక్ష పాలనను అడ్డుకోవడానికి చంద్రబాబు అన్ని పార్డీలను పొత్తులకు పిలిచారని ఆరోపించారు. పొత్తులకు పిలిచిన వెంటనే సంకలు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ వచ్చినట్లు ఉందన్నారు. తన టెంట్ హౌస్ పార్టీని అద్దెకు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడని, పవన్ కళ్యాణ్ అభిమానులు తనను సీఎం చేసుకోవాడినికి చొక్కలు చించుకుంటుంటే…. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి చొక్కలు చించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశయాలను తాకట్టు పెట్టె విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క బీజీపీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు చెబుతుంటే…పవన్ కళ్యాణ్ చంద్రబాబును అధికారంలోకి తెచ్చెందుకు చూస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలా ?అదే నీ ఆశయం అని ప్రశ్నించారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్న ముసుగు నేటితో తొలిగిందన్నారు.
పవన్ కళ్యాణ్ ముసుగు వీడి చంద్రబాబు కోసం తన పార్టీని అద్దెకు ఇచ్చెందుకు సిద్ధమయ్యాడనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయంలో కాపులందరూ రోడ్డు ఎక్కితే…ఇదే పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ్డని, వాళ్ళ కుటుంబాన్ని చంద్రబాబు అవమానించినప్పుడు…ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గద్దె దించెందుకు ఎంత అనైతిక పొత్తుకు అయిన చంద్రబాబు, పవకళ్యాణ్ సిద్దం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.