Site icon 123Nellore

జీవితంలో కష్టాలు ఉండకూడదా అయితే ఇలా పాటించండి!

Chanakya Nithi: భూమి మీద జీవించే ప్రతి ఒక జీవికి కష్టం అనేది ఏదో ఒక రూపంలో పొంచి వస్తుంది. మరి మనుషులు విషయానికి వస్తే ఈ కష్టాలు మరింతగా ఉంటాయి. కొందరు ఈ కష్టాన్ని ఎదుర్కొని గట్టెక్కితే.. మరికొందరు అడ్డుకోలేక ఉన్నచోట ఆగిపోతారు. మరి ఇలాంటి వారు బాగు పడాలి అంటే చాణక్య నీతులలో కొన్ని పాటించాలి అని తెలుస్తుంది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లిదండ్రులను, గురువులను, దేవతలను, ఎప్పుడూ గౌరవిస్తూ ప్రేమగా చూసుకోవాలట. ఇక మనం చేసే పనులు ఎక్కువ ఆసక్తి ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనసుతో ఆలోచించుకోవడం మంచిది. అసలు ఏదైనా విజయాన్ని సాధించాలి అంటే ముందర ఓటమి పాలు కావాలి. ప్రతి ఒక్క విషయంలో సంతృప్తి పడకూడదు. అసంతృప్తి పడుతూ ముందుకు వెళ్లాలి.

కర్మ అనేది ప్రతి ఒక్కరి వెనకాల పడుతుంది. కాబట్టి ఏ పనైనా చాలా జాగ్రత్తగా శ్రద్దగా చేయాలి. పెద్ద పెద్ద వేదాలు మత గ్రంథాలు చదివిన వారు కూడా సొంత ఆత్మను గ్రహించకపోతే వారి సొంత జ్ఞానం కూడా వ్యర్థం అయిపోతుంది. ఇక ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చాలా లోతుగా ఆలోచించడం మంచిది.

ఏ విషయమైనా లోతుగా ఆలోచించడం ద్వారా పరిష్కారం త్వరగా దొరుకుతుంది. అలా ప్రతి ఒక్క విషయంలో సరైన ఆలోచన ఉంటే అనుకొన్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని చాణక్య నీతి శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇక ఏ విషయాలు అయినా గ్రహించుకొని ముందుకు సాగితే ఎలాంటి సమస్యలు ఉండవని తెలుస్తుంది.

Exit mobile version