Site icon 123Nellore

సీఎంతో చర్చకు ఓకే..కానీ భాష మార్చాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏడేళ్లోలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి తాను కేసీఆర్ తో బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే బహిరంగ చర్చకు తాను సిద్ధమైనప్పటికి పెట్టిన షరతుకు కేసీఆర్ అంగీకరించాలన్నారు. కేసీఆర్ ప్రజలు మాట్లాడే భాషనే మాట్లాడాలని తెలిపారు. అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరుల సాక్షిగా కేసీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు.

central minister kishan reddy slams telangana cm kcr over political comments

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరని…కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారన్నారని జోష్యం చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ అన్నంతినే బల్లపై నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందో తెలుసా అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా బాంబ్ పేలుళ్లు లేవని, కర్ఫ్యూలు, మతకలహాలు లేవన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో నెలల పాటు రోడ్లన్నీ మూసివేసి ఉండేవని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల శాంతితో ముందుకు వెళ్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ బహిరంగ సవాల్‌ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి వ్యక్తులు, కుటుంబం కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు.. కానీ కేసీఆర్‌కు వ్యక్తులు, కుటుంబం మాత్రమే ముఖ్యమని కిషన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగంను ప్రపంచం అంతా పొగడని దేశం ఉండదన్నారు. ఇండియా అంటే ఇందిరా అనే నినాదాన్ని రాజ్యాంగం ద్వారనే ఓడించారని తెలిపారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్ ఓడిపోయారని అందుకే రాజ్యాంగం మారాలని అంటున్నారని మండిపడ్డారు.

Exit mobile version