Site icon 123Nellore

పులివెందులలో సీబీఐ పర్యటన..ఆ ప్రాంతంలో కొలతలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు  పులివెందులలో పలు ప్రాంతాలను సీబీఐ బృందం మంగళవారం పరిశీలించింది. సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలు.. వివేకానంద రెడ్డి ఇంటితోపాటు.. జగన్ మామ, భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇనాయతుల్లాను వెంటబెట్టుకుని పట్టణంలోని పలు ప్రాంతాలు సీబీఐ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇనాయతుల్లాతో పాటు  పాటు రెవెన్యూ సర్వేయర్లను కూడా సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం.

ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సీబీఐ ఎంపిక చేసుకున్న ప్రదేశాలను కొలతలు తీసుకున్నారు. వివేకా హత్యకేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ఇలా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం ప్రకారం తెలుస్తోంది.  గత ఐదారు రోజుల నుంచి ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు తమ వెంట తిప్పుకుంటున్నారని కూడా తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూం, బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఫోటోలు, వీడియోలు తీసింది ఇనాయతుల్లానే ఉండటంతో కొంత ఆసక్తిగా మారింది.

ఇనాయతుల్లా ఆ వీడియోలు, ఫోటోలు ముందుగా ఎవరెవరికి పంపారనే సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివేకా కేసు నెమ్మదించిన విషయం తెలిసిందే. అంతక ముందు విచారణ చేస్తున్న అధికారుల కారు డ్రైవర్ ను కడప వదిలి వెళ్లకపోతే బాంబులేస్తామని బెదిరించడం, సీబీఐ కేసులు కూడా పెట్టింది విధితమే. దీన్నీ సీరియస్ గా తీసుకుని తాజాగా కేసు విచారణ వేగవంతం కావడంతో కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారినట్లుగా కనిపిస్తోంది.

Exit mobile version