సాధారణంగా అరటిపండు తినడం అందరికీ ఇష్టం. దీని వల్ల అధిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి పండులో అధిక కేలరీలు కూడా ఉంటాయి. అరటి తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుందా లేదా అనే విషయం అందరిలో తట్టే ప్రశ్న. అరటిపండులో ఎక్కువగా పోటాషియం, కాల్షియం ఉంటాయి. ఈ రెండింటి వల్ల శరీరంలో ఉన్న బీపీ కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు ఎముకలు కూడా పటుత్వాన్ని కలిగి ఉంటాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్లు దీన్ని తీసుకుంటే మంచిదని చెప్తున్నారు వైద్య నిపుణులు. నీరసంగా ఉన్నవారు కూడా అరటి పండును శక్తి వనరుగా భావిస్తారు.
అన్నం తినకుండ కూడా అరటి పండ్లు తిని రోజంతా ఉండగలిగే ప్రొటీన్లు అరటిలో ఉంటాయి. అరటిని రోజూ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అరటి పండు వల్ల బీపీ కంట్రోల్ లో ఉండటమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటంటే…ఎముకలు దృఢంగా ఉండాలంటే అరటి పండు తినాలి. యుక్త వయసులో ఉన్నవాళ్లలో కూడా ఎముకల్లో నొప్పులు, పగుళ్లు వంటివి రాకుండా ఉండాలంటే అరటి పండ్లు తీసుకోవాలి.
జీర్ణ సమస్యలను మఠుమాయం చేయడంలో అరటి పండు పని చేస్తుంది. అరటిలో ఉండే స్టార్చ్ జీర్ణ వ్యవస్థకు ముఖ్యమైన బ్యాక్టిరియాకు మేలు చేస్తుంది. అరటిపండ్లు యాంటీ యాసిడ్ గా పరిగణిస్తారు. గుండెల్లో ఆసిడీ ఉన్నవాళ్లు అరటి పండు తింటే మంచింది. అరటి పండులో ఉండే కార్బో హైడ్రేలు తిన్న వెంటనే పొట్ట వెంటనే నిండేలా చేస్తాయి. బ్రేక్ ఫాస్ట్ మానేసినట్లయితే అరటి పండ్లు తింటే బ్రేక్ ఫాస్ట్ లోటు తీరుస్తుంది. అరటి పండును తింటే శక్తిని కూడా అందిస్తుంది.