Site icon 123Nellore

ఆ ఒంటె ధర రూ. 14 కోట్లు.. కారణం ఇదే..!

సంతలో జంతువుల కొనుగోలు, అమ్మకం అనేది మనకు తెలిసిందే. సాధారణంగా సంతలో అయితే కేవలం గొర్రెలు, మేకలను మాత్రమే విక్రయిస్తారు. కానీ అరబ్ దేశాల్లో అయితే ఒంటెలను కూడా విక్రయిస్తారు. అక్కడ ఉన్న ఎడారుల్లో ఒంటెలు బాగా ఉపయోగపడుతుంటాయి. దీంతో వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడ ఉన్న ఓ వీడియోలో ఉండే ఓ ఒంటె మాత్రం భారీ స్థాయిలో రేటు పలికింది. కోట్లు పెట్టి దీనిని అక్కడ ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

camel price more than 14cr in uae
camel price more than 14cr in uae

అయితే ఈ ఒంటెల వేలం జరిగింది అరబ్ దేశాల్లో. ఈ ఒంటెను అత్యధికంగా నగదు వెచ్చించి కొనడం కారణంగా అక్కడ ఉన్న వారు అంతా ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యారు. ఇంతకీ ఆ ఒంటె ఎంత పలికింది అనేది తెలుసుకోవాలి అని ఉంది కదా. అక్షరాలా ఏడు మిలియన్ రియాల్స్. అంటే భారత కరెన్సీలో సుమారు 14 కోట్లు పైనే అని చెప్పాలి.

స్థానికంగా ఉండే ఓ వార్తా సంస్థ పేర్కొన్న దాని ప్రకారం.. ఈ ఒంటె ఓ వేలంలో పాల్గొంది. దీని కోసం పోటీ పడిన కొందరు ఒక స్థాయి వరకు వచ్చి నిలిచి పోయారు. అనంతరం వేలం ముందుకు సాగలేదు. ఎందుకు అంటే అప్పటికే అది భారీ స్థాయిలో కొనుగోలుకు సిద్దం అయ్యింది. అయితే ఇంతలోనే మరో బిడ్ వచ్చింది. అది ఏకంగా నాలుగు కోట్లు ఎక్కవ పెట్టి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు అయితే ఏకంగా షాక్ గురి అయ్యి ఇంక పాడడం ఆపేశారు. అయితే ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో వైరల్ అవుతుంది. అయినా కానీ ఇంత పెట్టి ఎవరు కొన్నారు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version