Site icon 123Nellore

ఆ కమెడియన్ చనిపోయే ముందు నన్ను చూడాలని అనుకున్నాడంటూ బ్రహ్మానందం ఎమోషనల్!

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తికాదు.బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే. ఒకానొక దశలో అయితే దశలో అయితే విడుదలైన దాదాపు ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఉండేది. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలను తగ్గించేశాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా మాత్రం బాగా యాక్టివ్ లోనే ఉన్నాడు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కనిపించకపోయినా మీమ్స్ రూపంలో ఎప్పుడూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడు బ్రహ్మానందం.

ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షోకు వచ్చిన బ్రహ్మానందం తనలోని ఆ కోణాన్ని ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలం లో ఎందుకు సినిమాలు చేయడం లేదు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వయసు సహకరించడం లేదు అంటూ అసలు నిజాలు బయట పెట్టాడు.అలాగే సోషల్ మీడియాలో కొంతమంది అవకాశాలు రాలేదని ప్రచారం చేస్తున్నారు.. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే నేనే అవకాశాలను వదిలేస్తున్నాను అన్న విషయం వారికి తెలియదు అని తెలిపారు. ఇకపోతే రెండేళ్ల కిందట బ్రహ్మానందానికి హార్ట్ ఆపరేషన్ జరగటంతో, ఇంట్లో వాళ్లు కూడా విశ్రాంతి తీసుకోవాలని ప్రజర్ పెట్టడంతో కేవలం కొన్ని కొన్ని సినిమాలకు మాత్రమే సైన్ చేస్తున్నాడు.

కోట్లాదిమంది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందానికి నచ్చిన కమెడియన్ ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని సమాధానం చెప్పాడు బ్రహ్మానందం. తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎం.ఎస్ నారాయణ అని, అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాకుండా విద్యావేత్త కూడా ఉన్నాడు అంటూ అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఎమ్మెస్ చాలా బతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక పేపర్ పెన్ తీసుకుని బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అంటూ రాసి తన కూతురికి పంపించాడు అని తెలిపాడు. ఈ విషయం ఫోన్ చేసి చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో ఆపుకొని కిమ్స్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు బ్రహ్మానందం. అప్పుడు తన చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకుని చూసి కన్నీరు పెట్టుకున్నాడని, ఎమ్మెస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయిందిని, తాను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన పదిహేను ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఎమ్మెస్ చనిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎమ్.ఎస్.నారాయణ 2017 జనవరి 23న కన్నుమూశారని తెలిపారు.

Exit mobile version