బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిన్న (మే 25) తన 50వ జన్మదినాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. బాలీవుడ్ స్టార్లతో పాటు మన టాలీవుడ్ నుంచి కూడా కొందరు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే ఈ పార్టీలో కొన్ని విశేషాలు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి రాగా.. ఆయన మాజీ భార్య తన రూమర్డ్ భాయ్‌ఫ్రెండ్‌తో పార్టీకి అటెండ్ అయింది. ఇక విడాకులు తీసుకుంటామంటూ ప్రకటించిన మరో స్టార్ జంట నవ్వుతూ కలిసి వచ్చి మరీ ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు మన టాలీవుడ్ నుంచి కొందరు తారలు కరణ్ పార్టీలో తళుక్కుమన్నారు. ఆ కబుర్లన్నీ ఓసారి చూద్దాం..
హీరో హృతిక్ రోషన్, యువ హీరోయిన్ సబా ఆజాద్‌పై బాలీవుడ్ టౌన్లో ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఇప్పటివరకు చాలాసార్లు ఊహాగానాలు వెలువడ్డాయి. సబా ఆజాద్, హృతిక్ రోషన్ కలిసి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళుతూ.. ఇప్పటికే అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు. ఇక కరణ్ పుట్టినరోజు వేడుకల్లో ఈ జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రూమర్లను నిజం చేస్తూ తొలిసారి తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి పార్టీకి వచ్చాడు. మ్యాచింగ్ దుస్తుల్లో కలిసి వచ్చి.. ఇద్దరూ కెమెరాలకు ఫోజులిచ్చారు. అటు హృతిక్ మాజీ భార్య సుశానే తన ప్రియుడు అర్శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విడాకుల తర్వాత కలిసి కనిపించారు అమిర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. కాగా వీరిద్దరూ విడిపోతున్నట్లు గతేడాది జులైలో ప్రకటించారు.
ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘లైగర్’ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో విజయ్ టీమ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు.