Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ భామ సొంత చిత్రాలకు ప్రాణం పోసుకొని ఆమె నటించిన పాత్ర లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తను వెడ్స్ మనులో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తన నటనకు కొంత మంది అభిమానులు కూడా కూడపెట్టుకుంది.
ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముంచుకొస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ గాలి సినీప్రముఖుల మీదుగా దూసుకు వస్తుంది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు దీని బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో నటి స్వర భాస్కర్ కూడా చేరిన విషయం తెలిసిందే. ఆమె ఈ విషయం గురించి తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
కరోనా నిబంధనల ప్రకారం క్యారంటైన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఇదంతా పక్కన పెడితే ఎవరైనా సెలబ్రెటీలు కరోనా బారిన పడితే వారు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ భామ అంతటి అదృష్టానికి నోచుకోలేదు. నెటిజన్లే.. నెగిటివ్ కామెంట్స్ తో చంపేసేలా ఉన్నారు.
బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ట్విట్టర్ ఖాతాలో ఆమె సిగ్గుపడే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఒక ఆకతాయి. “పాపం.. కరోనా ను చూస్తే బాధగా ఉంది” అంటూ.. మరో నెటిజన్ “మోడీ మీద నిందలు వేసి విషయాన్ని క్లోజ్ చేయండి దీ దీ” చేయగా మరి కొందరు దీన్ని అతిపెద్ద గుడ్ న్యూస్ గా భావిస్తున్నారు.