మాజీ సీఎం, బీజేపీ నాయకులు ఉమా భారతి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు అని అనడంలో అతిశయోక్తి లేదు. ఓ ఫైర్ బ్రాండ్ లాగా దేశ రాజకీయాల్లోనే కాక , రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై ఈ మె తనదైన ముద్ర వేశారు. అయితే ఈమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె పార్టీ భాజపా అయినా సరే తనకు నచ్చని పని చేస్తే వారికి సింహ స్వప్నంగా మారుతారు. తాజాగా ఆమె సొంత ప్రభుత్వంపైనే విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు. లేకపోతే దీనిపై పోరాటం చేస్తాను అని అంటున్నారు.
తాజాగా.. ఉమాభారతి.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ మద్యంషాపుపై దాడికి దిగారు. పక్కన ఉన్న రాయిని తీసుకుని మద్యం బాటిళ్లను పగల గొట్టారు. మద్యపాన నిషేధం అమలు చేయాలి అని నినాదాలు చేశారు. ఈ ఘటన జరిగేటప్పుడు ఆమెతో పాటు అమె అనుచరులు కూడా ఉన్నారు.
1) बरखेड़ा पठानी आझाद नगर, बीएचईएल भोपाल , यहाँ मज़दूरों की बस्ती में शराब की दुकानों की शृंखला हैं जो की एक बड़े आहाता में लोगों को शराब परोसते हैं । pic.twitter.com/dNAXrh1jRY
— Uma Bharti (@umasribharti) March 13, 2022
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకుని వచ్చింది. దీనిపై ఉమా భారతి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మద్యం దుకాణం పై దాడికి దిగినట్లు నిపుణుల చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఉమా భారతి మద్యం షాపులో కి వెళ్లి దానిపై దాడి చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఉమా భారతి కి ఉన్న కోపానికి ఇది ఒక నిదర్శనం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మంచి పని చేసినట్లు చెప్తున్నారు. ఈ వీడియోను ఉమా భారతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.