ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారంలోనే కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతే ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ముందే ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వైయస్ఆర్ సీపీలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండటంతో వారిని మార్చక తప్పదని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుండి 40 నియోజకవర్గాల్లో తమ పార్టీ అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. తమ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేవలం అధికారంలోకి వచ్చినా తర్వాత సీట్లకు దగ్గరైన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.
మరోవైపు గ్రూపు రాజకీయాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 30 నియోజకవర్గాల్లో తమ పార్టీలో విభేదాలు ఉండటంతో వాళ్లకు టికెట్ ఇవ్వకుండా తప్పించడం గాని లేదా వేరే నియోజకవర్గాన్ని పంపడం గానీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు తిరిగి తమ తప్పులు ఒప్పుకుంటారో లేదా ఉన్న అవకాశాన్ని కోల్పోతారో చూడాలి మరి.