తెలుగు బిగ్ బాస్.. హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. పాత కంటెస్టెంట్లను వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లను ఛాలెంజర్స్‌గా ప్రకటించి హౌజ్‌లోకి పంపించారు బిగ్ బాస్. ఇక అప్పటి నుంచి రచ్చ షురూ అవుతుంది. అలకలు, గొడవలు, కోపతాపాలు స్టార్ అయిపోయాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. ముందుగా అరియానా తనకు అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు.
ఇక స్రవంతి, అజయ్ కలిసి అనిల్‌ని ఏడిపించడం మొదలుపెట్టారు. అషురెడ్డి, అరియనాలతో ట్రైయాంగిల్ ట్రాక్ ఉన్నట్లు అనిల్‌ని ఆటపట్టించారు. ‘నీ లవ్ మేం సెట్ చేస్తామంటూ’ స్రవంతి రచ్చ చేసింది. ఆ తరువాత మిత్ర వచ్చి ముమైత్ కి ‘ఐ లవ్యూ’ చెబుతూ ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. నిన్న కూడా అలానే చేసింది. ముమైత్ కొన్ని విషయాలను మిత్రతో షేర్ చేసుకుంటుంటే.. సడెన్ గా ఆమెకి హగ్గులిచ్చి, ముద్దులు పెట్టింది. ఎంతసేపటికీ ఆపకపోవడంతో ముమైత్ వదలమంటూ నవ్వుతూ చెప్పింది.
కానీ ఈరోజు మాత్రం ముమైత్ చాలా చిరాకు పడింది. అయినప్పటికీ మిత్ర ముద్దులు పెట్టడం ఆపకపోవడంతో ఆమె మెల్లగా తోసేసింది. మొత్తానికి మిత్ర తన బిహేవియర్ తో ముమైత్ బాగా చికాకు పెడుతోంది. ఈ వారం మిత్ర శర్మ కూడా నామినేషన్‌లో ఉంది. మరి సేవ్ అవుతుందో.. లేదో చూడాలి. ఇక బెడ్ రూమ్ లో హమీద, సరయు కలిసి క్లీన్ చేస్తుండడంతో ఆర్జే చైతు వచ్చి వాళ్లను ఏడిపిస్తున్నాడు. ఇంతలో సరయు తనదైన స్టైల్ లో బూతులతో సెటైర్లు వేసింది.