Site icon 123Nellore

బుక్‌ మై షో కి షాక్‌ ఇచ్చిన భీమ్లా నాయక్‌.. ఎందుకంటే..!

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అంటే ఫ్యాన్స్‌ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక రిలీజ్‌రోజు థియేటర్ల వద్ద భారీ క్యూ లైన్లు దైర్శనం ఇచ్చేవి. టికెట్లు దొరికిన వాళ్లు అదృష్టవంతులే అనుకోవాలి. అంత హడావిడి చేసేవారు. కానీ ఇదంతా ఒక్కప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ వచ్చిన తరువాత అందరూ అందులోనే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.  ఈ ఆన్ లైన్ టికెటింగ్ కోసం ఎన్ని యాప్స్ ఉన్నా.. బుక్ మై షో మాత్రం బాగా క్లిక్ అయింది.

దాదాపు అందరి ఫోన్లలో బుక్ మై షో యాప్ ఉంటుంది. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ సినిమా బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని బుక్ మై షో యాప్ వంక చూస్తూనే ఉన్నారు అభిమానులు. అయితే బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలింది. బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్ అయ్యారు భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద అదనపు భారం పడుతోందనే విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. దానికి బుక్ మై షో కమిషన్ కలిపితే రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకని కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుక్ మై షో యాజమాన్యం వసూలు చేసే సర్వీస్ ఛార్జి, సినిమా ప్రకటనలు రేట్లు తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయం సెటిల్ అయ్యే వరకు థియేటర్ కౌంటర్లో టికెట్స్ విక్రయించాలని భావిస్తున్నారు డిస్టిబ్యూటర్లు.

‘భీమ్లానాయక్’ సినిమాను నైజాంలో ఇప్పటికే ఒక థియేటర్ కు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసి.. ఆ తరువాత తీసేశారు. ప్రస్తుతానికి బుక్ మై షోలో ‘భీమ్లానాయక్’ సినిమా అందుబాటులో లేదు. ఈ విషయం గురించి సునీల్ నారంగ్ మీడియాకు వివరణ ఇచ్చారు. కన్వీనియెన్స్ ఫీ పేరుతో టికెట్ మీద 20 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తుండడం.. ప్రేక్షకులకు భారంగా మారిందని అన్నారు. కన్వీనియెన్స్ ఫీజు తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరినప్పటికీ.. బుక్ మై షో వాళ్లు అంగీకరించకపోవడంతో ‘భీమ్లానాయక్’ లాంటి పెద్ద సినిమాను బుక్ మై షోకి ఇవ్వకుండా థియేటర్ల దగ్గరే టికెట్స్ అమ్మాలని భావిస్తున్నారట.

Exit mobile version