Site icon 123Nellore

ప్రజల మెదడుకు విషం ఎక్కించే ప్రయత్నం : సజ్జల

మీడియా పేరుతో టీడీపీ అజెండాను మోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండపిడ్డారు. ప్రజల మైండ్ ను విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారని, రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్ట్రమూ మోయలేదని ఆక్షేపించారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమన్నారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ముఠా గురువారం వికారపు చేష్టలు చేశారని, తమదది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు, రాష్ట్రం మొత్తం మాకు సమానమేన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే వికేంద్రీకరణ నిర్ణయమని, న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామన్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదని విమర్శించారు. టీడీపీ వర్గమే గురువారం టపాకాయలు కాల్చి హంగామా చేసిందన్నారు.

‘‘అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తోంది. అమరావతిలో 30,913 ఎకరాలు పట్టా ల్యాండ్. 1,133 మంది చేతిలో పదివేల ఎకరాలున్నాయి. 10,050 మంది సీఆర్డీఏ తీసుకోకముందే అమ్మేశారు. 11 వేల మంది మాత్రమే నిజమైన రైతులున్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారు. రైతు ఉద్యమం పేరుతో చంద్రబాబు గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు వల్ల రైతుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కోసం కృష్ణా జిల్లాను గ్రీన్ జోన్ గా మార్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతుగా విచారణ జరపాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version