Diabetics: రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం ఏర్పడుతుంది. దీని డయాబెటిస్ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ఈ వ్యాధి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య అందరిలో ఎదురవుతుంది. దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇక ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల రొట్టె తింటే మంచిదని తెలుస్తుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీడిపప్పు రాగి పిండి రొట్టె: రాగి పిండిలో అధికంగా ఉండే పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరింత మేలు చేస్తాయి. కాబట్టి ఈ వ్యాధితో బాధపడేవారు.. రాగి పిండితో చేసిన రొట్టెలు తినడం మంచిది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా ఆహారం కూడా తక్కువ తీసుకుని శరీర బరువును తగ్గించుకోవచ్చు.
అమరాంత్ పిండి రొట్టె: ఉసిరికాయ పిండి ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఉసిరికాయ పిండి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పిండిలో ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉసిరి పిండితో చేసిన రొట్టెలు తినడం చాలా మంచిది.
శనగ పిండి రొట్టె: శెనగపిండిలో ఎక్కువగా కరిగే పీచు పదార్థం. ఇది కొవ్వు పరిమాణాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో చక్కెర స్థాయిని కూడా నెమ్మదిగా గ్రహిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని నెమ్మదిగా పెంచడం జరుగుతుంది.