Site icon 123Nellore

Health Tips: కాలీఫ్లవర్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…

Health Tips: సెప్టెంబర్ మాసం నుండి వరకు ఫిబ్రవరి మాసం వరకు పుష్కలంగా లభించే పంటలో కాలీఫ్లవర్ ఒకటి. శీతాకాలంలో చల్లటి వాతావరణం అధిక దిగుబడుల తో మార్కెట్ లో అందరికీ తక్కువ ధరలో లభించే పువ్వుగా కాలీఫ్లవర్‌ చెప్పుకోవచ్చు.కాలీఫ్లవర్‌ తినడం వలన ఇన్ని లాభాలు ఉంటాయా అని తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ కాలీఫ్లవర్‌ లో అధికంగా లభిస్తాయి. కనీసం వారానికి మూడు రోజులైనా కాలీఫ్లవర్‌ తీసుకోవడం వల్ల అనేకమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. కాలీఫ్లవర్‌ వలన ఇటువంటి లాభాలు ఉన్నాయి ఒక్కసారి చూద్దాం రండి.

ఈ మధ్యకాలంలో చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు దంత సమస్యలతో బాధపడుతున్నారు. దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా కాలీఫ్లవర్‌ తింటే అతి తక్కువ వ్యవధిలో ఉపశమనం పొందవచ్చు. అంతేగాక కాలీఫ్లవర్‌ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది అలానే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కాలీఫ్లవర్‌ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. తరచుగా కాలీఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చని కాలీఫ్లవర్‌లో విటమిన్ సి , మినరల్స్‌ ఎక్కువగా క్యాలరీలేమో తక్కువగా ఉంటాయి. కాలీఫ్లవర్‌ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా కాలిఫ్లవర్‌ని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కాలిఫ్లవర్‌ని థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు తరచు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version