బంగాళదుంపకు దేశంలో ఒక ప్రియారిటీ ఉంటుంది. దీన్ని ఒక్కోచోట ఒక్కో పేరుతో పలుకుతారు. దాని కూర లేకుండా శుభకార్యాలు జరగడం కూడా తక్కువే. కొన్ని ఏళ్లుగా ఇది చిప్స్ రూపంలో కూడా వస్తోంది. అయితే సాధ్యమైనంత వరకూ అందరూ బంగాళదుంపలకు ఉన్న చెక్కు తీసి వండుకుని తింటారు. మనకు తెలియని విషయం ఏంటంటే.. ఆ చెక్కులోనే బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. బంగాళ దుంప చెక్కులో మేలు చేసే కొవ్వూ, సోడియం లభిస్తాయి. మనిషి బరువు తగ్గడానికి ఉపయోగపడతుంది. అందుకే చెక్కుతో కలిపి వండుకుని తినడం మంచిది. చెక్కులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీఆక్సీడెంట్ లా పని చేస్తుంది. అలాగే బీ కాంప్లెక్స్ విటమిన్ ను కూడా అందిస్తుంది.
ఇందులోని కాల్షియం శీరీరానికి అందుతుంది. ఇవన్నీ ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బంగాళదుంప చెక్కులో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిపై పోరాడతాయి. బంగాళదుంపలో పీచు పదార్థం అధికంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చెక్కులో పోటాషియం, మినరళ్లూ కూడా ఉంటాయి. ఇవి గుండెకు మంచి చేస్తాయి. అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ ఒంట్లో పేరుకుపోయిన చెడు కొవ్వును దూరం చేస్తాయి. ఎప్పుడూ చెక్కుతో సహా వండుకుని తింటే ఎసెన్షియల్ నూట్రియంట్రు అందుతాయి.
బంగాళాదుంపలతో తయారు చేసిన బేస్ ప్యాక్‌లు చర్మ రంధ్రాలను, మచ్చలను కనబడనివ్వకుండా చేసి, మొటిమలను శాస్వతంగా నివారించడానికి సహాయపడతాయి. బంగాళాదుంపలతో పాటు ముల్తానీ మిట్టి, చర్మం రంగు మెరుగుపరుస్తుంది. చర్మం రంగు పాలిపోవడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముల్తానీ మిట్టి, బంగాళాదుంప మిశ్రమం క్రమంగా మొటిమలు, సన్ టానింగ్ ను నివారిస్తుంది. ముఖంలో కణితులను, చిన్నపాటి గడ్డలున్నా తొలగిపోయేందుకు పనికొస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు బంగాళదుంపల్ని తక్కవగా తినాలి. అధికంగా తినడం వల్ల ఒళ్లు నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.