ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్న సమయంలో పక్కనుండి జోరీగ మాదిరిగా బుర్….మంటూ గురక శబ్దం వస్తుంది. దీంతో పక్కనున్న వాళ్లకు ఇరిటేషన్ తెప్పిస్తుంది కూడా. ఈ సమస్యను ఎదుర్కొనే వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే దీని నివారణకు చిన్న చిట్కాలు పాటిస్తే నయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా.? నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీనివల్ల గురక నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూసినా గురక తగ్గుతుంది. సామాన్యంగా గురక పెట్టేవారు వెల్లికలా పడుకుంటారు. కానీ పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాక మీ పొట్ట భాగాన్ని గట్టి పరుచుకుంటే ఈ గురక తగ్గిపోతుంది. నిద్రపోయే ముందు ముక్కు నాళాన్ని శుభ్రం చేసుకోవాలి.
వీలైనంత శుభ్రం చేసుకుంటే కనీసం రాత్రి పండుకున్న వెంటనే గురక రాకుండా చేస్తుంది. నిద్రపోయేముందు నోట్లో నాలుగు తేనె చుక్కలు వేసుకున్నా తగ్గిపోవచ్చు. పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ముక్కు దిబ్బడను, గొంతునొప్పిని తగ్గిస్తుంది. గోరువెచ్చని పాలలో కొంచం పసుపు వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రపరిచి గురక రాకుండా చేస్తుంది సైనస్ వల్ల వచ్చే ఇబ్బందులను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు