ఇటీవల జరిగిన హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు వారిని సంప్రదాయం ప్రకారం చాలా గొప్పగా జరుపుకున్నారు. ఒకప్పుడు కేవలం ఉత్తర భారత దేశానికి మాత్రమే పరిమితం అయిన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రతీ ఏడాది జరిగే ఈ హోలీ వేడుకల తరువాత కొన్ని వార్తలు బయటకు వస్తాయి. వాటిలో కొన్ని మంచిగా ఉంటే మరికొన్ని విచారకమైనవిగా ఉంటాయి. అయితే ఈ ఏడాది కూడా కొందరు ఆకతాయిలు కలసి చేసుకున్న హోలీ సంబరాలు ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు ఆ ఆకతాయిలను నోటికి వచ్చినట్లు తిట్టి పోస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగింది అంటే… ఉత్తర్ ప్రదేశ్ లో కొందరు ఆకతాయిలు హోలీ పండుగా ఆడుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ హోలీ పండుగ ఆడేటప్పుడు రంగులు పూసుకోవడం, ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకోవడం లాంటివి చేస్తారు. ఇలానే ఆ కుర్రాళ్లు కూడా వాటర్ బెలూన్ ను చేతిలో పెట్టుకుని రోడ్డు మీద వెళ్లే ఓ ఆటో పై చల్లారు. దీంతో బెలూన్ అద్దంపై పడి పేలింది.
https://www.youtube.com/watch?v=PPtd3pZUAw0
అంతే వాటర్ బెలూన్ పేలడం తో ఒక్కసారిగా అందులో ఉండే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో ఆటో రోడ్డుపైనే బొలికింతలు పడుతూ కింద పడింది. దానిలో ఉన్న వారికి గాయాలు అయ్యాయి. ఇలా ఆటో పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.