Site icon 123Nellore

యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం : కేంద్ర కిషన్ రెడ్డి

అగ్నిపథ్ పథకంపై కుట్ర జరుగుతోందని, పథకం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కుట్ర చేసి విధ్వంసం సృష్టించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న అల్లర్లపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తిని పెంచే క్రమంలోనే అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టామని, అగ్నిపథ్ లాంటి పథకాలు అనేక దేశాల్లో అమల్లో ఉన్నాయి అని వివరించారు. ఇజ్రాయిల్ లాంటి దేశాల్లోను అగ్నిపథ్ పథకం అమల్లో ఉందని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో అగ్నిపథ్ లాంటి పథకాలు కచ్చితం అని, నాలుగేళ్ల తర్వాత విధిగా దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని వివరించారు.

అది సైనికుడిగా కుడా చేసే అవకాశం కావొచ్చని, దేశ సేవ చేయాలనుకున్నవారే అగ్నిపథ్‍లో చేరవచ్చని తెలిపారు. ఇది తప్పనిసరి స్కీమ్ కాదని, మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‍పై చర్చ జరుగుతోందని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‍లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికులు బైకులు తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వేస్టేషన్‍ను లక్ష్యంగా ఎంచుకోవదం దారుణమని, ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు.. బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

శాంతిభద్రతలు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.  అయితే శుక్రవారం ఉదయం నుండి  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‍లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరినీ రైల్వే పోలీసులు అదపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‍లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‍ఫీఎఫ్, సీఆర్‍ఫీఎఫ్ బలగాల ఆధీనంలో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే ట్రాక్ మొత్తాన్ని పోలీసులు క్లియర్ చేయడం ప్రారంభించారు.

Exit mobile version