Site icon 123Nellore

నవంబరులో అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలకు జగన్?

నవంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీతో అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని, వారికి కూడా ఒక మాట చెవిలో పడేసి అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని వైసీపీకి చెందిన ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆత్మకూరు ఉప ఎన్నిక తర్వాత అసెంబ్లీని రద్దు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. జూన్ నెలాఖరుకు ఆత్మకూరు ఉపఎన్నిక పూర్తి అవుతుంది.  ఐదేళ్లు పరిపాలించడం వైసీపీకి చేతకాదని, అందువల్లే ముందస్తుకు వైసీపీ సిద్ధమైందని టీడీపీ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తోంది.

మహానాడు దృష్టిని మళ్లించేందుకు బస్సు యాత్ర చేపట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసింది. అయితే బస్సు యాత్రకు వచ్చిన స్పందన చూసి, జగన్ కూడా ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. సర్వేలు కూడా వైసీపీకి ప్రతికూలంగా ఉండటం వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలతో తేటతెల్లమవుతోంది. ఈ వ్యతిరేకత ఇంతటితో పెరగకుండా నివారించుకోవడానికి సాధ్యమైనంత త్వరలో ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం సిధ్దమైందని అంటున్నారు.

ఓ వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా టీడీపీ గ్రామ గ్రామాన పర్యటిస్తోంది. ఇది సక్సెస్ అయితే వైసీపీ ఇరకాటంలో పడటం తప్పదని భావిస్తున్న సదరు నేతలు ముందస్తుకు వెళ్తే అటు లోకేష్ పాదయాత్రను కూడా కంట్రోల్ చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు..వైసీపీకి 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ టీడీపీ ఇంకా 40 స్థానాల వరకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ మైనస్ లు ముందస్తుకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు వైసీపీ పెద్దలు.

Exit mobile version