Site icon 123Nellore

బిపిన్ రావత్ చివరిసారిగా మాట్లాడిన మాటలను బయట పెట్టిన ప్రత్యక్ష సాక్షి.. ఏం మాట్లాడారంటే?

తమిళనాడులోని నీలగిరి హిల్స్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు మృతి చెందారు.అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ ఈ ప్రమాదాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రమాదం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన శివ కుమార్ అనే వ్యక్తి చివరిసారిగా మాట్లాడిన మాటలను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు.శివకుమార్ అనే వ్యక్తి స్థానికంగా కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు ఆయన ఒక పని నిమిత్తం నడుచుకుంటూ వెళ్తుండగా పలువురు హెలికాప్టర్ కూలినట్లు కేకలు వేయడంతో మేము కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నామని ఆ సమయంలో ఒక వ్యక్తి ఎటు వాలుగా ఉన్న చెట్ల పొదలలో పడిపోయి ఉన్నారు. అతను తనని కాపాడాలని వేడుకోవడంతో పాటు తనకు నీళ్ళు కావాలని సైగ చేశారని తెలిపారు. అయితే అతను ఏటవాలుగా చెట్ల పొదలలో పడి ఉండడంతో తనను రక్షించడానికి చాలా ఆలస్యం అయిందని అప్పటికే రెస్క్యూ సిబ్బంది అతనిని ఒక దుప్పటిలో తీసుకు వచ్చారని తెలిపారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత అతను ఒక చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ బిపిన్ రావత్ అనీ అతని సేవల గురించి తెలిసీ తను ఎంతో బాధ పడ్డానని దేశం కోసం ఎంతో సేవలు చేసిన ఒక వ్యక్తి చివరిసారిగా తనకు దాహం వేస్తుంది నీళ్ళు కావాలని అడిగినప్పుడు తన కోరికలు తీర్చలేక పోయానని శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా మా కళ్ళ ఎదుటగానే ఎంతో ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షి శివకుమార్ అక్కడ జరిగిన ప్రమాదం గురించి తెలుపుతూ భావోద్వేగం అయ్యారు.

Exit mobile version