సాధారణంగా కొందరు వాస్తు పద్ధతులను ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే వారు చేసే ప్రతి విషయంలోనూ వాస్తును అనుసరించి చేస్తుంటారు.ఇక చాలామంది విషయంలో జాతకంలో కొన్ని దోషాలు కారణంగా వారికి వయసు పైబడుతున్న కొద్దీ వివాహ కలిసిరావు. ఈ క్రమంలోనే ఎన్నో సంబంధాలు వస్తున్నప్పటికీ పెళ్లి మాత్రం కుదరదు.ఈ క్రమంలోనే ఎన్నో రకాల హోమాలు పూజలు చేసిన ఎలాంటి ఫలితం లేకుండా చాలా బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహం ఆలస్యం అయ్యేవారు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల వివాహం తొందరగా వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు వారి పడకగదిలో ఉత్తర దిశ వైపు పార్వతి శివుడు ఉన్న ఫోటో లేదా రాధాకృష్ణులు ఉన్నటువంటి ఫోటోను తగిలించాలి. అలాగే పడకగదిలో ఎల్లప్పుడూ కూడా నైరుతి మూలలో పదునైన వస్తువులు అనగా కత్తి కత్తెర వంటి వస్తువులను ఉంచకూడదు.ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తప్పనిసరిగా వివాహ గడియలు కలిసి వస్తాయని తొందరగా వివాహం కుదురుతుందని పండితులు చెబుతున్నారు.