Site icon 123Nellore

సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు ఏపీఎస్​ఆర్టీసీ ప్లాన్​.. ప్రత్యేక బస్సులంటూ అదనపు ఛార్జీ వసూలు

సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ పండగంటే ఏపీ ప్రజలకు ఎంతో స్పెషల్​. అందుకే దేశంలో ఎక్కడున్నా ఆ సమయానికి వారి స్వగృహాలకు చేరుకుని కుటుంబంతో కలిస సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే, దీన్ని ఏపీ ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఎపీఎస్​ఆర్​టీసి పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్సీటీ అధికారులు స్పష్టం చేశారు.

ప్రధానంగా హైదరాబాద్​, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 7 నుంచి మొదలు పండగ అనంతరం జనవరి 17 వరకు ఈ బస్సులు నడుస్తాయని తెలిపారు. కాగా, ఇందులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు కేటాయించగా.. బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి 360 బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు.

అయితే, ఈ ప్రత్యేక బసుల్లో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందకోసం ముందస్తుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీఎస్​ ఆర్టీసి వెబ్​సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Exit mobile version