Site icon 123Nellore

ఆపిల్‌ గింజలు ఎంత ప్రమాదకరమో తెలుసా?

ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ తీసుకునే వారెవ‌రైన ఆపిల్ త‌ప్పక తీసుకుంటారు. ఆపిల్ ఆరోగ్యానికి చాలామంచిది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

అయితే ఆపిల్ మ‌న‌కు ఎంత మేలు చేకూరుస్తుంతో దాని విత్త‌నాలు మ‌న‌కు తెలియ‌కుండానే అనారోగ్యం చేకూరుస్తాయట. ఆపిల్‌లో ఉండే నల్లని గింజ‌లు చాలా న‌ష్టాన్ని చేకూరుస్తాయి. చాలామంది అనుకోకుండా 1,2 గింజలను నమిలేస్తూ ఉంటారు. ఈ ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అనే ఒక పదార్థాన్ని కలిగి ఉంటాయి, ఇది మానవ జీర్ణ ఎంజైమ్లతో ప్రతిచర్య చెందిన వెంటనే సైనైడ్ను విడుదల చేస్తుంది. ఈ సైనైడ్ మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌పై అనేక ప్ర‌తి కూల ప్ర‌భావాల‌ను చూపిస్తుంది. శరీరం సైనైడ్కు గురైనప్పుడు, అది మెదడును & హృదయాన్ని దెబ్బతీస్తుంది, అలాగే శరీరాన్ని కోమాలోకి తీసుకువెళ్ళి, ఆ తరువాత మరణానికి దారి తీయగలదు.

ఒక ఆపిల్ పండు తినడం వల్ల అందులో ఉండే నాలుగైదు గింజలు తినే అవకాశం ఉంటుంది. అది కూడా అనుకోకుండా తింటారు తప్ప, ఎవరూ ఇష్టంగా తినరు. వాటిని తీసిపడేశాకే పండు తినేవారు ఎక్కువ. నాలుగైదు గింజలు తింటే భయపడాల్సిన అవసరం లేదు.  కనీసం 200 ఆపిల్ గింజలు కలిసి ప్రాణాలు తీయగలవు అందుకే ఆపిల్ గింజలు తినకుండా పడేయమని సూచిస్తారు వైద్యులు. ముఖ్యమైన విషయం ఏంటంటే పొరపాటున యాపిల్ గింజలను నమలకుండా మింగేస్తే ఏ ప్రమాదం ఉండదు. అవి మూత్రవిసర్జనలో బయటికి వచ్చేస్తాయి. నమిలి మింగితేనే సైనైడ్ విడుదల అవుతుంది. సో బి కేర్‌ ఫుల్‌.

Exit mobile version