Site icon 123Nellore

అబద్దాన్ని నిజంగా మార్చి నమ్మించే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉంది- కన్నబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్వయసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చాలని జగన్​ పాటుపడుతుంటే.. చంద్రబాబు మొసలి కన్నీరు పెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో దేశ వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటే.. రాష్ట్ర అభివృద్ది 9.3గా ఉందని గుర్తు చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో తొలి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్​తోనే సాధ్యమైందని పొగిడారు.

మరోవైపు, రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై చంద్రబాబు, లోకేశ్​ చేసిన వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. 20014లో వ్యవసాయానికి విద్యుత్​ ఇస్తే.. తీగలపై బట్టలారేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం ఉన్న చంద్రబాబు.. రైతులకు ఒక్క ప్రయోజనమైనా చేశారా?.. అంటూ ప్రశ్నించారు.

మరోవైపు విజయనగరం రామతీర్థం ఆలయ శంకుస్థాపన ఘటనపై స్పందించిన ఆయన.. ఆలయంలో ప్రొటోకాల్​ పాటించామని.. అశోక్ గజపతి తన స్థాయికి తగ్గట్లు వ్యవహరించకపోవడం వల్ల ఇంత గందరగోలం జరిగిందని అన్నారు. తనే అందరిపై దాడి చేసి తనపై దాడి చేసినట్లు గజపతి చిత్రీకరించారని అన్నారు. ఇప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ చూస్తోందని మండిపడ్డారు.  ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి.. నిజంగా నమ్మించే సిద్ధాంతాలను చంద్రబాబు ఫాలో అవుతున్నారని అన్నారు. మరోవైపు సినిమా టికెట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నాని చేసిన వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలని కన్నబాబు అన్నారు. ప్రజలపై భారం పడకుండా చూసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు.

Exit mobile version