AP Politics: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. బుధవారం ఆయన భార్య వైఎస్ భారితితో కలిసి రాజన్భన్కు వెళ్లిన జగన్.. గవర్నరు దంపతులు బిశ్వభూషణ్, సుప్రవ హరిచందన్‌లను పరామర్శించారు.
ఇటీవలే కోవిడ్‌తో పాటు పలు అనారోగ్య సమస్యలతో గవర్నర్ దంపతులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు చికిత్స తీసుకున్నారు. అయితే, తాజాగా వీరిద్దరు కోలుకుని.. రాజ్‌భవన్‌కు తిరిగొచ్చారు. ఈ క్రమంలోనేన గవర్నరు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. సతీమసేతంగా వెళ్లిన ఆయన.. కాసేపు గవర్నరుతో కలిసి ముచ్చటించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కొంతకాలం విరామం తీసుకుని పూర్తిగా కోలుకోవాలని సూచించారు. కాగా, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకున్నట్లు జగన్‌కు గవర్నర్ తెలిపారు. విధులను కూడా సాధారణంగానే నిర్వహించగలుగుతున్నట్లు గవర్నర్ జగన్‌కు వివరించారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాజకీయ అంశాలతో పాటు, పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. పంట, ఆస్తి నష్టంతో పాటు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికీ పలు చోట్ల ఆ వరద ప్రభావం అలాగే ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు, అమలు చేయాల్సిన పథకాలు, ఇటీవలే ముంచెత్తిన వరదల ప్రభావం తదితర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌తో పాటు పలువురు అధికారులు కూడా గవర్నర్‌ను కలిసేందుకు వచ్చారు.