Site icon 123Nellore

భవిష్యత్తులో ఒక్క పులివెందులలోనే 10 వేల మందికి ఉద్యోగాలు- జగన్​

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి కడపజిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. గురువారం ప్రొద్దుటూరును సందర్శించిన ఆయన.. ఈ రోజు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల  పెట్టుబడితో ఏర్పాటు ఆదిత్య బిర్లా ఫ్యాషన్​ అండ్​ రిటైల్ లిమిటెడ్​ కంపెనీకి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఆదిత్యా బిర్లా పెట్టుబడులను సీఎం జగన్ చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ఇంత మంచి కంపెని పులివెందులలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్ననారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

ఆదిత్య బిర్లా సంస్థ ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటని సీఎం జగన్ తెలిపారు. ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జగన్ ప్రకటించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక వేత్తలకు జగన్ ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.

అంతే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో స్కిల్ డెవలెప్​మెంట్​ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పులివెందులలో ఏకంగా 323 ఏకరాల్లో జగనన్న కాలనీలు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు రూ. 147 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

Exit mobile version