Site icon 123Nellore

లిప్ లాక్ ట్రోల్స్ పై స్పందించిన అనుపమ పరమేశ్వరన్!

Anupama Parameswaran: టాలీవుడ్ ప్రేక్షకులకు అనుపమ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ‘శతమానం భవతి’ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన అందంతో ఫ్యాన్స్ కి ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తాను ఓ వెలుగు వెలుగుతుంది.

Anupama Parameswaran
Anupama Parameswaran

అను సోషల్ మీడియా ఇన్ స్టాల్ లో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎప్పటికప్పుడు తన పోస్ట్ లను తన ఫ్యాన్స్ కు పంచుకుంటుంది. ఇదిలా ఉండగా కుర్ర హీరో ఆశిష్ సరసన రౌడీ బాయ్ సినిమాలో నటించగా ఈ రోజు సినిమా రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఈ సినిమాలో అనుపమ లిప్ లాక్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో అనుపమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి . ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం అలా కొత్త కుర్రాళ్లకు లిప్ లాక్ చేస్తావా అని కొందరు అంటున్నారు. లిప్ లాక్ ఇవ్వడానికి ఓ రేంజ్ వుండాలనేది చూసుకోవా అని ఫ్యాన్స్ తెగ కడిగేస్తున్నారు.

ప్రస్తుతం ఈ లిప్ లాక్ సీన్ నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుంది. ఏదైనా ఈ లిప్ లాక్ అనుపమ ఫ్యాన్స్ కు గుండె పగిలినంత పని అయింది. తాజాగా అనుపమ దీని గురించి స్పందించి ఫ్యాన్స్ ను ఊరడించింది. సినిమాలో తన పాత్ర ముద్దు పెట్టింది ఆశిష్ పాత్ర అని చెప్పింది. సినిమాలోని ఆ సీన్ చూస్తే నెటిజన్లు నిర్ణయం మార్చుకుంటారని తన అభిమానులకు అనుపమ హామీ ఇచ్చింది.

Exit mobile version