ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగా దిగజారినట్లు కనిపిస్తుంది. ఇప్పటికీ పరాజయాలతో ఉన్న టీడీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిపోటీతో ఉంది. మామూలుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో కూడా త్రిముఖపోటీ ఉన్నట్లయితే టీడీపీ మళ్లీ నిరాశ చెందక తప్పదు. దీంతో ఎలాగైనా వైసీపీ పార్టీని ఎదుర్కోవాలని టీడీపీ ముందస్తు కొన్ని ప్రణాళికలు చేసుకుంటుందని తెలుస్తుంది. గతంలో టీడీపీ.. బీజేపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి నామమాత్రంగానే సీట్లు కేటాయించే వాళ్ళు.
కానీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు ఇది పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఎలాగైనా జనసేనకు 30 నుండి 50 స్థానాలు అడిగే అవకాశం ఉంటుందని.. దీంతో చంద్రబాబు.. జనసేన, వామపక్షాలకు కేటాయించే స్థానంలో ఎమ్మెల్యే కోసం టిక్కెట్లు ఆశించే నాయకులను బ్రతిమాలుకోవటం అనేది ఉన్నట్లే కనిపిస్తుంది.
కానీ కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జి లను నియమించకుండా నెట్టుకువస్తారని తెలుస్తుంది. ఎలాగైనా యాభై స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా ఇప్పటి నుంచే ఎలాగైనా అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.