Site icon 123Nellore

బాబు ప్లాన్ ఆఫ్​ యాక్షన్​కు తేదేపా నేతల గుండెల్లో హడల్​!

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పని చేయని అధికారులు, నేతలకు ఎలా క్లాస్​ పీకేవారో అందరికీ తెలిసిందే. ఎవరైనా సరిగ్గా పనిచేయకుంటే.. వారిని పదవుల్లో నుంచి తప్పించి.. సమర్తులకు పెద్దపీట వాస్తామని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు. అయితే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీలో సరిగా లేని వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు బాబు. ఈ క్రమంలోనే ఇకపై పని చేయని, పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే వారిపై వేటు తప్పదంని అంటున్నారు. అందులో బాగంగానే పలువురునేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేస్తున్నారు.

ఇప్పటివరకు గతన వారం రోజుల్లో నలుగురు పార్టీనేతలను సస్పెండ్ చేశారు. దీంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఇటీవలేే జరిగిన మన్సిపల్​ ఎన్నికల్లో నేతల పనితీరును పరిశీలించిన చంద్రబాబు.. వారిపై వేరే రేంజ్​లో ఫైర్​ అవుతున్నారు. ఇప్పటి వరకు ఓపిక పడుతూ వచ్చామని.. ఇకపై సహించే ప్రశక్తే లేదని మొహం మీద చెప్పేశారట. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన వారిని నెల్లూరు జిల్లాలో పలువురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతోనే వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో చంద్రబాబు ప్లాన్ ఆఫ్​ యాక్షన్​ను నేతల్లో భయం మొదలైంది. ఇకపై ఇంకా ఎంతమందిని ఇలా సస్పెండ్ చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే కొందరి నేతల వ్యవహార తీరుపై బాబు ఆధారాలు సేకరించారని.. త్వరలోనే వారిపైనా వేటు తప్పదని టాక్ నడుస్తోంది. దీనిపై స్పందించిన సీనియర్ నేతలు.. బాబు ఇలా ఉంటేనే పార్టీ మనుగడలో ఉంటుందని అంటున్నారు.

Exit mobile version