AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం సీఎస్‌తో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఏడు గంటలకుపైగా ఈ సమస్యపై చర్చంచారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ సహా ప్రతి అంశంపైనా బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి వివరంగా చర్చించారు.
కార్యదర్శుల కమిటీ నివేదికకు తాము మద్దతు ఇవ్వబోమంటూ వ్యతిరేకిస్తూ.. 11వ పీఆర్సీని అథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేంద్ర వేతన సంఘంతో తమకు ఎలాంటి సంబందం లేదంటూ ఫిట్‌మెంట్‌పై తమ డిమాండ్లను తెలియజేశాయి. ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఫిట్‌మెంట్‌పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కాకుండా అందరు కలిసి ఒక నెంబర్ చెప్తే బాగుంటుందని కోరారు. ప్రస్తుతం ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల హమీ ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తమకు సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. ప్రస్తుతం చర్చలో జరిగిన అంశాలన్నీ వివరించి త్వరలోనే సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా మరోసారి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.