‘జబర్దస్త్’ ఫేమ్ హైపర్ ఆది గురించి లవ్ అఫైర్ విషయాలు వినిపించడం తక్కువే. కానీ తాజాగా హైపర్ ఆది, వర్షిణి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఇది ఆన్ స్క్రీన్ పై కాదు. రియల్ లైఫ్‌లో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే అనుమానాలు బలంగా మొదలయ్యాయి.
బుల్లితెరపై యాంకర్‌గా తనదైన శైలిలో ఎంతోమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ వర్షిని. వర్షిని యాంకర్‌గా చేస్తున్న కానీ ఢీ రియాలిటీ షో ద్వారా ఆమె మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. వెండితెరపై చాలా సినిమాల్లో నటించింది. ఈ విధంగా తన కెరియర్ లోనే చాలా బిజీగా ఉంటూ ముందుకు పోతోంది వర్షిని. అలాగే సోషల్ మీడియాలో కూడా యాంకర్ వర్షిని ఎప్పుడూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆది పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన పార్టీలో పాల్గొన్న వర్షిణి… పార్టీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకు జోడించిన క్యాప్షనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘‘ప్రియమైన ఆది.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నా జీవితంలో ఎప్పటికీ ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరకుంటున్నాను. నా అత్యంత ఇష్టమైన వ్యక్తి, నా 3am (తెల్లవారుజాము 3 గంటలు) స్నేహితుడు, నాకు సపోర్ట్‌గా ఉండే వ్యక్తివి నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది❤️” అని ఆ వీడియో క్యాప్షన్‌లో పేర్కొంది. అయితే వర్షిణి పోస్ట్ ఆదిని బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తూ చేసినట్లే కనిపిస్తోన్నా కొందరు నెటిజన్లు మాత్రం.. ‘సమ్‌థింగ్.. సమ్‌థింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్త కేవలం కామెంట్లకు మాత్రమే పరిమితం అవుతుందా.. లేక వర్షిణి, ఆది దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా చూడాలి.