Anasuya Bharadwaj: టాలీవుడ్ ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సుమ, ఝాన్సీ ఉదయభాను లు తర్వాత అంతటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇద్దరు పిల్లల తల్లి అయిన చక్కటి అందంతో ఎంతోమంది మతి పోగొడుతుంది. చెప్పాలంటే అనసూయ కోసమే షో చూసే వారు చాలా మంది ఉన్నారు.
ఇక ఈ భామ సోషల్ మీడియా ఇన్ స్టా లో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఇదే క్రమంలో రిపబ్లిక్ డే నాడు.. అనసూయ అందర్నీ విష్ చేస్తూ.. వందేమాతరం పాడింది. అందరికీ గణతంత్ర దినోత్సవం తెలిపింది. వందేమాతర గీతం ఎంతో అందంగా పాడినప్పటికీ.. అనసూయ కు నెటిజన్ల నెగిటివ్ పోరు తప్పలేదు.
ఆ పాట పాడిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టా లో పంచుకుంది. ఇక కొందరు నెటిజన్లు నేషనల్ ఆంథమ్ పాడే ముందు ఎందుకు గౌరవంగా నిలబడలేదు లేదు. పాడే ముందు టీ షర్ట్ మీద ఎందుకు గాంధీ బొమ్మ వేసుకున్నావ్ అని నెటిజన్లు తెగ ఆడిపోసుకున్నారు.
దానికి అనసూయ నెటిజన్లకు బాగానే రిప్లై ఇచ్చింది. “నేను ఇండియన్ ని.. ఐ లవ్.. రెస్పెక్ట్.. నా గుర్తింపుకు వాల్యూ ఇచ్చుకుంటాను” అని చెప్పి గాంధీ టీ షర్ట్ విషయానికి వచ్చి “ఆగస్టు 15, 1947 తరువాతే జనవరి 26, 1950 అయ్యింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకొని మాట్లాడండి” అంటూ కామెంట్ రూపంలో బాగానే కౌంటర్ వేసింది.