Site icon 123Nellore

యువ హీరోతో అనన్య పాండే బ్రేకప్?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే బ్రేకప్ వ్యవహారంపై బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అనన్య పాండే, స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖట్టర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన విషయం తెలిసిందే. అయితే ఒక నెల క్రితం కూడా ఒక బర్త్ డే పార్టీలో తన ప్రియుడితో కలిసి కనిపించిన ఈ భామ ఇప్పుడు బ్రేక్ అప్ చెప్పేసింది అని వార్తలు గుప్పుమంటున్నాయి.

Ananya Panday and Ishaan Khatter break up after 3 years relationship

అనన్య, ఇషాన్ కలిసి ‘ఖాళీ పీలీ’ అనే సినిమా కోసం వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసిందని అప్పట్లో అందరూ చెప్పుకొన్నారు. తరచూ వీరిద్దరూ టూర్స్‌కు వెళ్లి రావడం, షాహిద్‌ నివాసంలో జరిగే పలు ఫంక్షన్స్‌లో అనన్య సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలవడం ఈ ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా వీరు రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో అనన్య-ఇషాన్‌ విడిపోయినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది. వారిద్దరూ విడిపోయారని, అయితే వారు స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారని అంటున్నారు.

Ananya Panday and Ishaan Khatter break up after 3 years relationship

ఇక అనన్య విషయానికి వస్తే.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2’తో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రసుత్తం బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

Exit mobile version